టీడీపీ నేత ఇంటికి అల్లు అర్జున్.. ఇదేం ట్విస్టు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) తాజాగా టీడీపీ నేత ఫామ్ హౌస్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన మెగా ఫ్యాన్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల అల్లు అర్జున్ తన కారులో బెంగళూరుకు బయల్దేరారట. మార్గమధ్యలో ఆయన గార్లదిన్నె మండలంలోని కనుంపల్లి వద్ద ఉన్న శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు, టీడీపీ నేత ముండిమడుగు కేశవరెడ్డి(Mundimadugu keshavareddy) ఫామ్ హౌస్‌కు వచ్చారట. అక్కడ కేశవరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి(Rahul reddy) అల్లు అర్జున్‌కు ఆహ్వానం పలికారట. ఇందులో భాగంగా.. బన్నీకి రాయలసీమ రుచులతో విందు ఏర్పాటు చేశారని సమాచారం. తమ ఊరికి అల్లు అర్జున్ రావడం తెల్సుకున్న అభిమానులు.. బన్నీని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది. అనంతంరం అల్లు అర్జున్ బెంగళూరు కు వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వరాల అవుతున్నాయి.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తో పుష్ప ది రూల్(Pushpa the rule) సినిమా చేస్తున్నారు. రష్మిక మందనా(Rashmika mandana) హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత బన్నీ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తో జతకట్టనున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా.. 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.