పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో శుక్రవారం టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ ని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. కానీ హైకోర్టు మాత్రం 4 వారాలపాటూ మధ్యంతర బెయిల్ మంజారు చేసింది.
Also Read : చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
కానీ శుక్రవారం బెయిల్ ఆర్డర్స్ చంచల్ గుడ అధికారులకి అందేసరికి జైలు సమయం అయిపోవడంతో అల్లు అర్జున్ శనివారం ఉదయం 06:30 గంటల ప్రాంతంలో రిలీజ్ అయ్యాడు. దీంతో తన అనుచరులతో కలసి బన్నీ ఇంటికి వెళ్లకుండా నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నాడు. అల్లు అర్జున్ కోసం కుటుంబ సభ్యులు నిద్రపోకుండా రాత్రంతా మేలుకుని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బన్నీ కోసం ఫ్యాన్స్ గీత ఆర్ట్స్ వద్ద వెయిట్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి అల్లు అర్జున్ ని అరెస్ట్ చెయ్యడంతో బన్నీ ఫ్యామిలీతోపాటూ ఫ్యాన్స్ కూడా ఆందోళనకి గురయ్యారు.