టాలీవుడ్ స్టార్ హీరోలలో అల్లు అర్జున్ (Allu Arjun)కు ఓ ప్రత్యేకమైన..స్టార్ స్టేటస్ ఉంది. తన స్టైలీష్ లుక్, భిన్నమైన డ్యాన్స్, అంతకుమించిన వ్యక్తిత్వం..ఇలా ప్రతి విషయంలో అందరి కంటే భిన్నంగా ఉండే బన్నీ ప్రతిదీ లగ్జరీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.
లగ్జరీ కార్లు..ఇల్లు టాప్ ప్లేస్లో ఉండేలా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. తన విలాసవంతమైన జీవితంలో నుంచి ఇప్పటివరకు తన స్టేటస్ ని నిరూపించే వస్తువులనే చూశాం. ఇక ఇప్పుడు తన సింప్లిసిటీని చూసే అవకాశం వచ్చింది. అదేంటో చూద్దాం.
తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఫోటో ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలో అల్లు వారసుడు అల్లు అయాన్ (Allu Ayaan) ‘నవారు మంచం’పై ఆరుబయట, చల్లగాలిలో సేద తీరుతూ పడుకున్నాడు. అయితే, ఇలాంటి నవారు మంచాలను మనం ఎక్కువగా ఊర్లలో చూస్తుంటాము.
మిడిల్ క్లాస్..లో క్లాస్ ఫ్యామిలీలోనే ఎక్కువగా కనిపించే ఈ మంచాలు..ఐకాన్ స్టార్ ఇంటిలో చూసేసరికి ..అల్లు ఫ్యామిలీ సింప్లిసిటీ అందరికీ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజులో కాసేపు అయిన పిల్లలను ప్రకృతి మధ్య గడిపేలా..స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేలా చూసుకోవాలని స్నేహారెడ్డి ఇటీవల తన పేరెంటింగ్ వీడియోలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ డైరెక్టర్స్ అట్లీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టేసాడు.