Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి

Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ అనంతరం ఫ్యామిలీతో గడుతున్నాడు. లేటెస్ట్గా హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి మంగళవారం (జనవరి 21న) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోస్ పంచుకున్నారు. స్నేహరెడ్డి పోస్ట్ చేసిన ఈ ఫొటోల్లో అల్లు అర్జున్తో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు.ఇందులో అల్లు జంట మరియు వారి పిల్లలు వైట్ టీ-షర్టులు ధరించి నవ్వుతూ కనిపిస్తున్నారు.

ఈ ఫొటోస్కి అల్లు స్నేహ " బ్లెస్డ్ విత్ ది బెస్ట్" అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ఫ్రెమ్లో అల్లు అర్జున్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఐదేళ్ల పాటు పుష్ప కోసం భారీ గడ్డం, లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటేన్ చేసిన బన్నీ.. షార్ట్ హెయిర్ స్టైల్, గడ్డంతో  ఫ్రెష్గా ఉన్నాడు. ఈ కొత్త స్టైల్ అల్లు అర్జున్కి బాగా సూటైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ  | Kiran Abbavaram: తండ్రి కాబోతున్న హీరో కిరణ్‌ అబ్బవరం.. గుడ్ న్యూస్ చెబుతూ ఫొటో షేర్‌

సంధ్య థియేటర్ ఘటన, జైలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న అల్లు అర్జున్.. బయట పెద్దగా కనిపించడం లేదు. ఇక ఎట్టకేలకు సోషల్ మీడియాలో ద్వారా స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.