Allu Arjun: తొక్కిసలాట ఘటన తర్వాత.. తొలిసారి సినిమా ఈవెంట్‍కు అల్లు అర్జున్.. కానీ, వాళ్లకు నో ఎంట్రీ!

Allu Arjun: తొక్కిసలాట ఘటన తర్వాత.. తొలిసారి సినిమా ఈవెంట్‍కు అల్లు అర్జున్.. కానీ, వాళ్లకు నో ఎంట్రీ!

నాగ చైతన్య నటించిన తండేల్(Thandel) మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 2న) తండేల్ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో జరగనున్న తండేల్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రానున్నారు. ఈ మేరకు మేకర్స్ మరోసారి X వేదికగా పోస్ట్ పెట్టారు. "ఫిబ్రవరి 2న ఐకానిక్ తండేల్ జాతర. ఈవెంట్ గ్రాండ్గా జరగనుంది. ఈ సారి అస్సలు గురి తప్పదు" అంటూ నోట్ రిలీజ్ చేశారు. అయితే, ముందుగా ఈ ఈవెంట్ నేడు (శనివారం) జరగాల్సింది. కానీ అనివార్య కారణాల వలన ఈవెంట్ రేపటికి (ఆదివారం) పోస్ట్ ఫోన్ చేశారు.

అయితే, హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తొలిసారి ఈవెంట్కు రానున్నారు. దాంతో తండేల్ ఈవెంట్ను భారీ భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సినిమా లవర్స్కు, అభిమానులకు నో ఎంట్రీ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ | హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో తండేల్

తండేల్ ఈవెంట్ ఇండోర్లో జరుగుతున్నందున.. కేవలం తండేల్ సినిమా యాక్టర్స్, టెక్నీషియన్స్, మరికొంత మంది సెలెబ్రెటీస్ మాత్రం అటెండ్ కానున్నట్లు టాక్. దీంతో ఫ్యాన్స్కి ఎంట్రీ లేదని, అందుకోసం పాస్ క్లూ కూడా ఇస్యూ చేయలేదని సమాచారం. దీన్ని బట్టి చూస్తే, సినిమా ఫ్యాన్స్ లేకుండా తండేల్ ఈవెంట్ జరగనుందన్నమాట.

అయితే, ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ ఏం మాట్లాడునున్నారనేది ఇటు ఫ్యాన్స్లో, రాజకీయ నాయకులలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్తో మంచి ఫామ్లో ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో ఇండియాన్ సినీ హిస్టరీలో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాడు. దాంతో అల్లు అర్జున్ తన కొత్త సినిమాని త్రివిక్రమ్తో చేయనున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కొత్త లుక్ లోకి మారిపోయాడు.