HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

మే 20 ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ కి పండుగ రోజు. ఎందుకంటే ఆరోజు ఆయన పుట్టినరోజు. అందుకే ఆరోజున ఆ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు కేకులు కట్ చేసి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి.. FEAR is FIRE.. అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుండగా.. మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుండి విడుదలైన ఫియర్ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాపై అంచనాలు పెంచేసింది.