సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోని అరెస్ట్..

 సంధ్య థియేటర్ ఘటన..  అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోని అరెస్ట్..

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.  మహిళా తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీని గుర్తించిన పోలీసులు  డిసెంబర్ 23న అరెస్ట చేశారు. సినిమా ఈవెంట్ లు ఎక్కడ  జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తుంటాడు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సమయంలో కూడా ఆంటోని బన్నీకి సెక్యూరిటీగానే ఉన్నాడు. కాసేపట్లో ఆంటోనిని సంధ్య థియేటర్ కు తీసుకెళ్ళనున్నారు పోలీసులు. 

మరో వైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ అల్లు అర్జున్ను విచారించారు. న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరు కావడం గమనార్హం. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. 

ALSO READ | అల్లు అర్జున్ ఇంటికి పరదాలు.. కనిపించకుండా మొత్తం కప్పేశారు

కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు రానున్నారు. ఈ మేరకు పీఎస్ దగ్గర పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.  దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నలతో అల్లు అర్జున్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దాదాపు 20కి పైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ తెలియదని.. మరి కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని సమాచారం.