ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) వీరాభిమాని చిన్నారి శ్రీవాసుదేవ(Sri vasudeva)(12) మృతి చెందాడు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈ చిన్నారి మంగళవారం కన్నుమూశాడు.
వివరాల్లోకి వెళితే.. కష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన 12 ఏళ్ల శ్రీవాసుదేవకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన డాన్స్ అన్నా, ఆయన సినిమాలన్నా చాలా ఇష్టపడేవాడు. ఎప్పటినుండో అల్లు అర్జున్ ను చూడాలనేది శ్రీవాసుదేవ కోరిక. పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్ ఆ బాబును కలుసుకునేందుకు సిద్దమయ్యాడు. కానీ ఈలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. తన చిన్నారి అభిమాని మరణ వార్త విని అల్లు అర్జున్ చాలా బాధపడ్డారు, బాలుడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
Also Read : కండిషన్స్ మధ్య మెహర్ కొత్త సినిమా.. ఛాన్స్ ఇచ్చిన బడా నిర్మాణ సంస్థ