అల్లు అర్జున్ ఇంటిపై దాడి

అల్లు అర్జున్ ఇంటిపై దాడి
  • రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని ఓయూ జేఏసీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం దాడి చేశారు. గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండ్లను పగులగొట్టారు. ఈ క్రమంలో వారిని అల్లు అర్జున్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓయూ జేఏసీ నేతలు బైరు నాగరాజు గౌడ్, రెడ్డి శ్రీను ముదిరాజ్, బోణాల నగేశ్ మాదిగ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్​లోని అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఓయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.