ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశ తప్పదా? పుష్ప2(Pushpa2) రిలీజ్ లేట్ కానుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ఈ ఆలస్యాన్ని బన్నీ ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు.
అయితే ఇటీవల పుష్ప2 నుండి రిలీజైన గ్లింప్స్ తో కాస్త సంతృప్తి చెందారు. దీంతో సినిమా కూడా మరికొన్ని నెలల్లో రిలీజ్ అవుతుందని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం పుష్ప2 రిలీజ్ మరికాస్త ఆలస్యం కానుందట. దీనికి కారణం.. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్(Sukumar) ప్రస్తుతం హాలిడే వెకేషన్లో ఉన్నారట. అందువల్ల పుష్ప2 షూటింగ్ కు కొన్నిరోజులుగా బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఆలస్యం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను 2024 సమ్మర్ కు రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే షూటింగ్ లో జాప్యం కారణంగా పుష్ప2 రిలీజ్ పోస్ట్ పోన్ చేయక తప్పడంలేదట. దీంతో 2024 చివర్లో పుష్ప2 రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ:వెండితెరపై ఇళయరాజా జీవితం.. ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరో
ఇక పుష్ప2 సినిమా విషయానికి వస్తే... నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయనుంది అనేది తెలియాలంటే 2024 చివరివరకు ఆగాల్సిందే.