
Pushpa2TheRule: బాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2: ది రూల్" రిలీజ్ అయిన రోజునుంచే రోజుకో రికార్డు బ్రేక్ చేస్తో దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా అత్యంత స్పీడ్ గా రూ.1500 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసిన పుష్ప 2 ఇప్పుడు బాలీవుడ్ లో మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే హిందీలో ఇప్పటివరకూ దాదాపుగా రూ.632 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. దీంతో హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని పుష్ప 2 చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ కూడా షేర్ చేశారు. అంతేగాకుండా 100 ఏళ్ళ బాక్సాఫీస్ రికార్డులని పుష్ప 2 బ్రేక్ చేసిందని మేకర్స్ తెలిపారు.
ఇప్పటివరకూ హిందీలో హైయ్యస్ట్ కలెక్షన్లు(నెట్) సాధించిన సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్(రూ.640 కోట్లు - ఆల్ టైమ్), రాజ్ కుమార్ రావ్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన స్త్రీ 2(రూ.597.55 కోట్లు), సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ (రూ.543 కోట్లు), షారుఖ్ ఖాన్ పఠాన్(రూ.521 కోట్లు), సన్నీ డియోల్ గడార్ 2 (రూ.515 కోట్లు ) తదితర సినిమాలు టాప్ లో ఉన్నాయి. కానీ కేవలం 15 రోజుల్లోనే పుష్ప 2 ఈ కలెక్షన్ల రికార్డులని బ్రేక్ చేసింది. దీంతో నార్త్ ఆడియన్స్ బన్నీ యాక్టింగ్ కి ఫిదా అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం హిందీలో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం, త్వరలోనే క్రిస్మస్ సెలవులు కూడా మొదలవుతుండటంతో ఈ అంశం కూడా బాగానే కలసి వచ్చేలా ఉంది. దీంతో హిందీలో మాత్రమే దాదాపుగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi - THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥
— Pushpa (@PushpaMovie) December 20, 2024
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/LWJa7W2JxT