![చెర్రీ కొడుకులాంటోడు.. ఏకైక మేనల్లుడు.. వాళ్ళని జైలుకి పంపిస్తా: అల్లు అరవింద్](https://static.v6velugu.com/uploads/2025/02/allu-arvind-gets-emotional-talking-about-ram-charan_aBHzqrEfid.jpg)
టాలీవుడ్ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ వాసుతో కలసి తండేల్ మూవీ పైరసీ గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఇందులోభాగంగా గతంలో పైరసీ ని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుని సక్సెస్ అయ్యామని తెలిపాడు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలకు ఓటిటి, థియేటర్స్ లో రిలీజ్ చేసుకునే వెసులుబాటుని కల్పించడంతో పైరసీ దాదాపుగా తగ్గిపోయిందని కానీ గత 2 నెలలుగా మళ్ళీ పైరసీ మహమ్మారి చాప క్రింద నీరులా పెరుగుతోందని అణచి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జనవరిలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమాతో మొదలైందని దీంతో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ ఐన వెంటనే హెచ్డీ ప్రింట్ ని లీక్ చేస్తున్నారని దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపాడు. అయితే తాము పైరసీ ని అరికట్టేందుకు ప్రతేకంగా సైబర్ సెల్ ని ఏర్పాటు చేశామని.. దీంతో సినిమా రిలీజ్ సమయంలో కొంత బడ్జెట్ వెచ్చించి సినిమాలు పైరసీ చేసేవారిని గుర్తిస్తామని కాబట్టి పైరసీ లింకులు షేర్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
ALSO READ | పట్టుకోవడం చాలా ఈజీ జాగ్రత్త.. ఇక మీ ఇష్టం: తండేల్ పైరసీపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్
అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ లో లింకులు షేర్ చేస్తే అడ్మిన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీతో సులభంగా పైరసీ చేస్తున్నవారిని ట్రేజ్ చేస్తామని కాబట్టి పైరసీ కి పాలపడి జీబీతాల్ని నాశనం చేసుకోవద్దని సూచించాడు.
ఇక తండేల్ సినిమా ఈవెంట్ లో దిల్ రాజుతో మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాని తక్కువ చేసి మాట్లాడానని కొందరు తనని ట్రోల్ చేశారని కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే రామ్ చరణ్ కొడుకులాంటోడు.. ఏకైక మేనల్లుడు.. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ దయచేసి మా మధ్య విభేదాలు సృష్టించవద్దని కోరాడు.
ఆ ఈవెంట్ లో దిల్ రాజు లైఫ్ గురించి చెబుతూ అలా మాట్లాడాల్సి వచ్చిందని అందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేసాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నందుకు థాంక్స్ చెబుతూ ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరాడు. అల్లు అరవింద్ రామ్ చరణ్ పై చేసిన ఈ వాఖ్యలతో అల్లు-మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వినిపిస్తున్న వార్తలకు చెక్ పడింది.