క్లాస్, మాస్‌‌‌‌కు నచ్చేలా అల్లు శిరీష్ 'బడ్డీ'

క్లాస్, మాస్‌‌‌‌కు నచ్చేలా  అల్లు శిరీష్ 'బడ్డీ'

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్స్. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో కేఈ  జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ‘టెడ్డీ’ అనే మూవీ తమిళంలో వచ్చింది, అలాగే ఇంగ్లీష్‌‌‌‌లోనూ ఇలాంటి సినిమా వచ్చిందని చెప్పా. అయితే కథ విన్నాక టెడ్డీ బేర్‌‌‌‌‌‌‌‌కు ప్రాణం రావడం  మినహా అంతా కొత్తగా ఉందని  అర్ధమైంది.

ఇందులో ఫైలట్‌‌‌‌గా కనిపించబోతున్నా.  నాది ఇంటెన్స్‌‌‌‌ క్యారెక్టర్.  లవ్‌‌‌‌స్టోరీ కూడా ఉంటుంది. నాలుగు మేజర్ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి.  క్లాస్, మాస్ అందరినీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుంది. జ్ఞానవేల్ రాజా గారు రాజీ పడకుండా నిర్మించారు. రీమేక్ అని చాలామంది అనుకున్నా.. సినిమా చూశాక స్ట్రయిట్ మూవీ అని వాళ్లే అంటారు.  ఒక సినిమా తర్వాతే మరొక సినిమా చేయడం నాకిష్టం. అందుకే నా మూవీస్ లేట్ అవుతున్నాయి’ అని చెప్పాడు.