తక్కువ టికెట్ రేట్స్‌‌‌‌‌‌‌‌తో బడ్డీ చిత్రం

తక్కువ టికెట్ రేట్స్‌‌‌‌‌‌‌‌తో బడ్డీ  చిత్రం

అల్లు శిరీష్ హీరోగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ఇందులో ఫస్ట్ హీరో టెడ్డీ బేర్ అయితే.. నేను సెకండ్ హీరో.  యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువ చేశా.

యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి. ‘బడ్డీ’ మీ అందరినీ బాగా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుంది. అలాగే సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్‌‌‌‌‌‌‌‌ 125 రూపాయల టికెట్ రేట్స్ పెట్టాం. అందుకు నిర్మాతకు థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ చెబుతున్నా’ అన్నాడు.  ‘ఈ మూవీలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం.  ప్రేక్షకులు కూడా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తారు’ అని హీరోయిన్స్ చెప్పారు.  ‘శిరీష్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. లవ్, యాక్షన్, కామెడీ లాంటి అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది.  టికెట్ రేట్స్ కూడా తగ్గించారు’ అని అలీ అన్నారు.  నటుడు గోకుల్, దర్శకుడు శ్యామ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.