Game Changer: రామ్ చరణ్ కి అల్లు హీరో సపోర్ట్.. ఇకనైనా ఆ రూమర్స్ కి చెక్ పడినట్లేనా..?

Game Changer: రామ్ చరణ్ కి అల్లు హీరో సపోర్ట్..  ఇకనైనా ఆ రూమర్స్ కి చెక్ పడినట్లేనా..?

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ఈ జనవరి 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 2న గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయగా అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ మాత్రమేకాదు పలువురు దర్శకనిర్మాతలు సైతం రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు.

అయితే శుక్రవారం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు శిరీష్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ పై స్పందించాడు. ఇందులోభాగంగా ఇటీవలే గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూశానని తనకి బాగా నచ్చిందని తెలిపాడు. అలాగే రామ్ చరణ్ గెటప్స్, లుక్స్, యాక్టింగ్ అద్భుతమని అన్నాడు. ఇక వింటేజ్ శంకర్ మళ్ళీ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశాడు.  సోషల్ డ్రామా+మాస్ హీరోయిజంతో జనవరి 10న వస్తున్న ఈ సినిమా కోసం ఎక్సైటెడ్ గా ఎదురుచూస్తున్నారని తన అధికారిక "ఎక్స్" లో పేర్కొన్నాడు. అంతేకాకుండా గేమ్ ఛేంజర్ పోస్టర్ కూడా షేర్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాకి మొదట్లో మెగా కాంపౌండ్ నుంచి పెద్దగా సపోర్ట్ లభించలేదని టాక్ వినిపించింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ గట్టిగా జరిగాయి. కానీ చివరి నిమిషంలో సాయి దుర్గ తేజ్, నాగబాబు తదితరులు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సపోర్ట్ గ ట్వీట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అల్లు శిరీష్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి సపోర్ట్ గా ట్వీట్ చెయ్యడంతో ఫ్యాన్ వార్స్ అలాగే మెగా అల్లు హీరోల మధ్య విబేధాలు ఉన్నాయంటూ వినిపిస్తున్న రూమర్స్ కి దాదాపుగా పులిస్టాప్ పడినట్లు తెలుస్తోంది.