జైలు నుంచి విడుదలయ్యాక కుటుంబ సభ్యులతో బన్నీ ఇలా..

జైలు నుంచి విడుదలయ్యాక కుటుంబ సభ్యులతో బన్నీ ఇలా..

సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజూ ఉదయం 06:30 గంటల ప్రాంతంలో చంచల్ గూడ జనులు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదల కాగానే నేరుగా జూబ్లీ హిల్స్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళాడు. అనంతరం అక్కడినుంచి తన ఇంటికి వెళ్ళాడు. అప్పటికే బన్నీ భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అర్హ, అయాన్, తల్లిదండ్రలు అల్లు అరవింద్, నిర్మల తదితరులు బన్నీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ రాగానే దిష్టి తీసి హారతి ఇచ్చి ఆహ్వానించారు. 

అల్లు స్నేహ రెడ్డి హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. దీంతో బన్నీ స్నేహ రెడ్డిని ఓదార్చాడు. ఇక పిల్లలు రాత్రంతా నిద్రపోకుండా తండ్రి ఎదురు చూసిన అర్హ, అయాన్ బన్నీని చూడగానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నారు.  ఫ్యామిలీ సభ్యులు కూడా బన్నీతో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ దృశ్యాల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు అభిమానులు.

Also Read : అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ గురించి తెలిస్తే అవాక్కవుతారు..

అయితే జైలు నుంచి రిలీజ్ అయిన  తర్వాత  విలేఖర్లతో మాట్లాడిన అల్లు అర్జున్ తాను ప్రస్తుతం బానే ఉన్నానని ఆందోళ చెందాల్సిన అవసరం లేదని అభిమానులకి సూచించాడు. అలాగే తానూ చట్టాన్ని గౌరవిస్తానని, కానీ ఆరోజు అనుకోకుండా ఆ సంఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. అలాగే సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.