![Allu Sneha Reddy: అల్లు స్నేహ రెడ్డి ఫిట్నెస్ వీడియో..వర్కౌట్స్తో అదరగొట్టేసింది](https://static.v6velugu.com/uploads/2024/03/allu-sneha-reddy-latest-workout-video-sharing-in-her-instagram_tUPSg1wCFc.jpg)
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే అల్లు అర్జున్(Allu Arjun..Sneha Reddy)స్నేహారెడ్డి అనడంలో సందేహం లేదు. స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా గుర్తింపు పొందుతూనే..సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇన్నాళ్లు అల్లు అయాన్, అర్హలా వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చింది స్నేహారెడ్డి. ఇక కొన్నాళ్లుగా యోగ జిమ్ వర్కౌట్స్, ఫ్యామిలీ ఈవెంట్ అప్డేట్స్తో పాటు అందమైన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ వస్తుంది.
లేటెస్ట్గా ఆమె గార్డెన్ ఏరియాలో జిమ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అలాగే యోగా చేస్తూ..తన మంచి ఫిట్నెస్ కు రహస్యం ఇదే అని వీడియో ద్వారా తెలిపింది.ఈ వీడియోలో బుద్ధునికి నమస్కరించి..తనదైన వర్కౌట్స్తో హీరోయిన్స్కి ఏ మాత్రం తగ్గేదేలే అనేలా ఉంది. ప్రస్తుతం అల్లు స్నేహ రెడ్డి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే..ఆ మధ్య అల్లు స్నేహరెడ్డి సినిమాల్లోకి వస్తుందనే టాక్ కూడా వినిపించింది.ఇక అల్లు ఫ్యామిలీ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి మోడల్గా వస్తుందంటూ మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఏదేమైనా అల్లు స్నేహ ఎలా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అవ్వడం మాత్రం కన్ఫమ్ అంటూ ఐకాన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.