విశాక ఇండస్ట్రీస్​కు ఏఎల్​ఎంఎం సర్టిఫికేషన్..13శాతం పెరిగిన షేర్​ ధర

విశాక ఇండస్ట్రీస్​కు ఏఎల్​ఎంఎం సర్టిఫికేషన్..13శాతం పెరిగిన షేర్​ ధర

న్యూఢిల్లీ: విశాక ఇండస్ట్రీస్ అరుదైన అవకాశం దక్కించుకుంది. కంపెనీ సోలార్​ రూఫ్​ ప్రొడక్టులకు కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ‘అప్రూవ్డ్ ​లిస్ట్​ ఆఫ్​ మోడల్స్​ అండ్​ మాన్యుఫాక్చరర్స్​’ (ఏఎల్​ఎంఎం) సర్టిఫికేషన్​ ఇచ్చింది. 

దీనిని సాధించిన మొదటి భారతీయ కంపెనీ తమదేనని విశాక ప్రకటించింది. ఇన్నోవేటివ్​, సస్టెయినబుల్​, ప్రభుత్వ గుర్తింపు పొందిన సోలార్ ​ఎనర్జీ సొల్యూషన్లను అందించే  సత్తా తమకు ఉందనడానికి సర్టిఫికేషన్ ​నిదర్శమని కంపెనీ ​ఎక్స్చేంజ్​ ఫైలింగ్​లో తెలిపింది. 

మనదేశ రెన్యువబుల్​ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రకటించింది. ఏఎల్​ఎంఎం సర్టిఫికేషన్ రావడంతో కంపెనీ షేర్ ​ధర బుధవారం 13.53 శాతం పెరిగి రూ.98.66 కు చేరుకుంది. హైదరాబాద్​కు చెందిన విశాక ఇండస్ట్రీస్ ​ఫైబర్ షీట్లు, స్పిన్నింగ్ యార్న్​,  సోలార్ ప్యానెల్స్​ తయారు చేస్తోంది.