Good Health: బాదం కంటే.. బాదం పాలు ఎంతో ఆరోగ్యం.. గుండెకు మరింత మంచిదంట..!

Good Health: బాదం కంటే.. బాదం పాలు ఎంతో ఆరోగ్యం.. గుండెకు మరింత మంచిదంట..!

ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టు కొని చాలామంది బాదం తింటుంటారు. బాదం వల్ల ఎలాంటి లాభాలున్నాయో... అంతకంటే ఎక్కువ బాదం పాలలో ఉన్నాయి. బాదంపాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. శరీరానికి కావల్సిన పోషకాలను బాదం పాలు అందిస్తాయి. బాదం పాలలో విటమిన్ డీ, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తాయి. విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉండటం వల్ల చర్మం, సంరక్షించబడుతోంది. అంతేకాదు శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. 

Also Read:-ఇది సార్ మన ‘టీ’ రేంజ్.. భారతీయుల ఆల్ టైమ్ ఫేవరేట్ ‘టీ’కి FDA గుర్తింపు

బాదం పాలలో మన శరీరానికి పనికొచ్చే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ను, హైబీపీ తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది. బాధపడేవాళ్లు బాదం పాలను తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరదు. ఎక్కువ ఆకలిని దూరం చేస్తుంది. దీంతో బరువు తగ్గొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. వ్యాయామం ఎక్కువగా చేసేవారు బాదం పాలు తాగితే కండరాలు బలంగా తయారవుతాయి. శరీరం చక్కని ఆకృతి పొందుతుంది.

వెలుగు లైఫ్..