వామ్మో ఇంత డబ్బే.. రూ.5 కోట్ల డబ్బులు.. కిలో బంగారం.. పోలీసులు సీజ్ చేశారు..!

వామ్మో ఇంత డబ్బే.. రూ.5 కోట్ల డబ్బులు.. కిలో బంగారం.. పోలీసులు సీజ్ చేశారు..!

బెంగళూరు: కర్ణాటకలోని గడగ్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు, బంగారం, విదేశీ మద్యం లభ్యమైంది. బెటగేరి పట్టణంలో వడ్డీ వ్యాపారి ఎల్లప్ప మిస్కిన్ ఆగడాలకు, వేధింపులకు తాళలేక అశోక్ గణచారి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా.. బెటగేరిలో వడ్డీ వ్యాపారులే నివాసాల్లో.. బెళగేరి పట్టణంలోని 13 ప్రాంతాల్లో  పోలీసులు తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లోనే భారీగా లెక్కాపత్రం లేని కోట్ల డబ్బు, బంగారం, విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో అవసరానికి అప్పు అడిగిన వాళ్లను పీల్చి పిప్పి చేస్తున్న ఎల్లప్ప మిస్కిన్తో పాటు మరో ఆరుగురు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. 4కోట్ల 90 లక్షల 98వేల రూపాయల ట్రంకు పెట్టెల్లో ఉన్న డబ్బును, 992 గ్రాముల బంగారం, 65 లీటర్ల లిక్కర్ బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.

వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అప్పులు తీసుకున్న వారి నుంచి రకరకాల పేర్లతో మిత్తీలు వసూలు చేస్తూ కోలుకోకుండా చేస్తున్నారు. అవసరాలు ఎలా ఉన్నా ఒకసారి లోన్​ తీసుకుంటే వ్యాపారుల చేతికి చిక్కినట్లే. పలుకుబడిగల వ్యక్తుల చేతుల్లో దందా నడుస్తున్నందున ఆపద సమయంలో ఎవరిని ఆశ్రయించాలో తెలియక బెదిరింపులు, ఒత్తిళ్లు  తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొస్తున్న చిట్​ఫండ్, మనీ లెండింగ్, మైక్రో ఫైనాన్స్, ఆన్​లైన్ సంస్థలపై నిఘా లేకపోవడంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. 

ALSO READ | మనసెలా వచ్చిందో.. బాత్రూం కమోడ్ పక్కనున్న ట్యాప్కు పైప్ తగిలించి.. ఆ నీళ్లతో..

గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేసేవారు అసలు రికార్డుల్లోనే లేరు. లైసెన్సులు తీసుకున్న మనీ లెండర్లు కూడా వడ్డీ ఎంత వసూలు చేస్తున్నారన్న విషయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు.   వ్యాపారులు సమర్పించే రికార్డ్స్​ఆధారంగానే  లైసెన్స్​ల రెన్యూవల్​చేస్తున్నారు. అప్పు ఇచ్చేటప్పుడు పూచీకత్తు తీసుకోవడంతోపాటు బ్లాంక్​ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకోవడం బాధితుల కొంపముంచుతోంది. వందకు రూ.5 నుంచి  అవసరాన్ని బట్టి రూ.20 దాకా వడ్డీ వసూలు చేస్తున్నారు. వందకు రూ.20 వడ్డీతో గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్​ దందా నడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.