ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు

వానలకు కొట్టుకుపోయిన దారులు

నిజామాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు అర్బన్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలోని దాదాపు అన్ని రోడ్లు పాడయ్యాయి. సారంగాపూర్, 7లో రేడియో స్టేషన్, 5లోని బోర్గం, 10, 11వ డివిజన్ల పరిధిలో బ్రహ్మపురి, నాగారం బ్రహ్మణకాలనీ, నిర్మల్ హృదయ కాన్వెంట్ రోడ్, మహాలక్ష్మి టెంపుల్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.  ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న జనం నిత్యం నరకం చూస్తున్నారు.  అయితే రోడ్ల రిపేర్లకు ప్రతిపాదనలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రోడ్ల డెవలప్‌‌మెంట్‌‌ బడ్జెట్ ఏదీ?

అర్బన్‌‌లో రోడ్ల అభివృద్ధికి  కార్పొరేషన్ బడ్జెట్‌‌లో ఫండ్స్  కేటాయించిన దాఖలాలు లేవు. డివిజన్ అభివృద్ధికి వచ్చిన ఫండ్స్‌‌లోనే రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. వర్షాల సమయంలో కార్పొరేషన్ స్పెషల్ ఫండ్స్‌‌తో రిపేర్స్ చేపడుతోంది. నిధులు వెచ్చిస్తున్నా రోడ్ల పరిస్థితి మారడంలేదు. ప్రతీ వర్షాకాలంలో దెబ్బ తిన్న రోడ్లకు రూ.50 లక్షలు ఖర్చు చేస్తూ గుంతలు మాత్రం పూడుస్తున్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం లేదు. కొన్ని చోట్ల డెవలప్‌‌మెంట్‌‌కు కెటాయించిన ఫండ్స్‌‌తోనే మెయిన్ రోడ్ల మెయింటెన్స్‌‌ చేస్తున్నారు. అయితే డ్రైనేజీలు, సానిటేషన్‌‌పై పట్టించుకునే ఆఫీసర్లు రోడ్లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

గుంతల రోడ్లపై నరకయాతన

వర్షాలతో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. రోడ్లపై ప్రయాణం నరకంగా ఉంది. గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కార్పొరేటర్లు  ఆఫీసర్లు పట్టించుకుంట లేరు. -  రాజ్‌‌కుమార్, స్థానికుడు

రోడ్ల అభివృద్ధికి చర్యల్లేవి..

నగరంలోని 36, 35వ డివిజన్లలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు గుంతలుగా మారినా అధికారులు పట్టించుకుంటలేరు. స్థానిక ఎమ్మెల్యే టీవీ డిబెట్‌‌లు తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఆయన అర్బన్‌‌లో పర్యటిస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తది.  - కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌, స్థానికుడు

రిపేర్లకు రూ.2.5 కోట్ల అంచనా

వర్షాలతో అర్బన్ లో 35 రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి రిపేర్‌‌‌‌కు రూ. 2.5 కోట్ల ఫండ్స్ కావాలి. ఇందుకు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. ఫండ్స్ రాగానే రిపేర్లు చేపడతాం.  -  హరిశంకర్, ఏఈ కార్పొరేషన్ 

....................................................................................................

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఆందోళన

బోధన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్‌‌ చేస్తూ బోధన్ పట్టణంలోని ఎమ్మార్పీఎస్‌‌, ఎంఎస్పీ, ఎంఎంఎస్  అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి రైల్వేగేట్, మున్సిపల్ ఆఫీసు, తహాసీల్దార్ ఆఫీసు మీదుగా ఆర్డీవో ఆఫీసుకు చేరుకుని ఆర్డీవో రాజేశ్వర్‌‌‌‌కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ డల్లా సురేశ్‌‌ మాట్లాడుతూ ఎస్పీ వర్గీకరణ కోసం 28 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా తమగోడును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి ఎస్సీలను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ బోధన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మానికొల్ల గంగాధర్, పట్టణ అధ్యక్షుడు పానుగంటి భరత్‌‌, ఎంఎంఎస్ జిల్లా నాయకులు పిల్లనగోయి సావిత్రి, నాయకులు లసీంగారి భూమయ్య, గుమ్మట్టు పద్మ, బూరే శంకర్, బండారి పోశెట్టి,  కాశిగొల్ల గంగాధర్, తాడెం సాయిలు, మనోహర్, బాలరాజ్, సందీప్, నవీన్, నరేందర్, రాజ్‌‌కుమార్‌‌‌‌ తదితరులు 
పాల్గొన్నారు. ​ 

.........................................................................................................

స్టూడెంట్లకు షూస్‌‌ పంపిణీ

మోర్తాడ్, వెలుగు: మండలం పాలెం హైస్కూల్‌‌లో స్టూడెంట్లకుగురువారం ఎంఈవో  ఆంధ్రయ్య, హెచ్‌‌ఎం సిరీల్‌‌రావు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని గ్రామంలోని దాతల ఆర్థిక సాయంతో 45 మంది స్టూడెంట్లకు షూస్, సాక్స్ అందజేసినట్లు చెప్పారు.  కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, టీచర్లు స్టూడెంట్లు 
పాల్గొన్నారు.

...........................................................................................

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

ఆర్మూర్, వెలుగు: ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ డిమాండ్​ చేశారు. గురువారం ఆర్మూర్‌‌‌‌లో జరిగిన పీవైఎల్ మండల కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్లు జారీ చేయడం లేదన్నారు. సీఎం ప్రకటనతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారని, ఇంకా నోటిఫికేషన్ల ప్రక్రియ కొలిక్కి రాలేదన్నారు. సీఎం మాటల గారడి బంద్ చేసి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీవైఎల్ మండల ప్రెసిడెంట్​ రోహిత్, సెక్రటరీ తూర్పాటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మనోజ్, నాయకులు కిశోర్, వెంకటి, విజయ్ పాల్గొన్నారు.

.....................................................................................

టీఆర్‌‌‌‌ఎస్‌‌తోనే రాష్ట్ర అభివృద్ధి 

డిచ్‌‌పల్లి, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌‌‌‌గౌడ్ అన్నారు. గురువారం నిజామాబాద్​ రూరల్​ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌లో 69 లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ వంటి పథకాల ప్రయోజనాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు. అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, ఇందిరా, మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్‌‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

.................................................................................................

డబుల్‌‌ ‌‌బెడ్‌‌ ‌‌రూం ఇండ్లు ప్రారంభం

వర్ని, వెలుగు: పాత వర్నిలో నిర్మించిన 40 డబుల్‌‌ ‌‌బెడ్‌‌ ‌‌రూం ఇండ్లను స్పీకర్‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌‌‌‌ పోచారం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. నిరుపేదలకు నీడ నిచ్చేందుకు అన్ని హంగులతో డబుల్‌‌‌‌ బెడ్‌‌ ‌‌రూం ఇండ్లను నిర్మించామన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలో పది వేల ఇండ్లు కట్టినట్లు చెప్పారు.

..................................................................................................

కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌తో నేరాల నియంత్రణ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: సైబర్ నేరాల నియంత్రణ కోసమే ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిందని సీపీ నాగరాజు చెప్పారు. గురువారం న్యూ అంబేద్కర్ భవన్‌‌లో  సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో స్మార్ట్‌‌ ఫోన్ల  వాడకం విపరీతంగా పెరిగిందని, దీంతో సైబర్‌‌‌‌ నేరాలు కూడా పెరిగాయన్నారు. పరిచయం లేనివారితో చాటింగ్‌‌లో చేయొద్దన్నారు. మహిళల రక్షణపై పోలీసు శాఖ స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టిందన్నారు. అడిషనల్‌‌ డీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి ఆధ్వర్య౦లో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా షీ టీమ్స్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా అన్‌‌లైన్‌‌ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్  డీసీపీ ఉషా విశ్వనాధ్ తిరునగరి, డీఈవో డి.దుర్గాప్రసాద్, జిల్లా నోడల్ ఆఫీసర్ వనిత, స్పెషల్ బ్రాంచి ఎస్సై సంతోష్ కుమార్, షీ టీమ్స్ ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఐటీ కోర్ సిబ్బంది,  టీచర్స్, స్టూడెంట్లు పాల్గొన్నారు.

...........................................................................................................

టీయూ క్యాంపస్‌ డ్రైవ్‌‌లో 34 మంది సెలెక్ట్

డిచ్‌‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో ఎసెన్సియా బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్స్ కోసం గురువారం నిర్వహించిన క్యాంపస్​ డ్రైవ్‌‌లో 34 మంది స్టూడెంట్లు సెలెక్ట్ అయినట్లు వీసీ రవీదంర్ తెలిపారు. ఈ నెల 16న హైదరాబాద్‌‌లో నిర్వహించే ఇంటర్వ్యూ లో సెలక్ట్​ అయిన స్టూడెంట్స్‌‌లో ఇద్దరిలో ఒకరికి  జాబ్స్ కేటాయిస్తారని తెలిపారు. స్టూడెంట్ల పురోభివృద్ధి కోసం ఇటువంటి డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిపార్ట్‌‌మెంట్‌‌ హెచ్‌‌వోడీ బాలకిషన్, కంపెనీ సైంటిస్టులు శ్రీనివాస్‌‌ రెడ్డి, మహిపాల్‌‌రెడ్డి పాల్గొన్నారు.

...........................................................................................

స్టూడెంట్లకు షూస్‌‌ పంపిణీ

మోర్తాడ్, వెలుగు: మండలం పాలెం హైస్కూల్‌‌లో స్టూడెంట్లకుగురువారం ఎంఈవో  ఆంధ్రయ్య, హెచ్‌‌ఎం సిరీల్‌‌రావు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని గ్రామంలోని దాతల ఆర్థిక సాయంతో 45 మంది స్టూడెంట్లకు షూస్, సాక్స్ అందజేసినట్లు చెప్పారు.  కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, టీచర్లు స్టూడెంట్లు 
పాల్గొన్నారు.

....................................................................

పాము కాటుతో వ్యక్తి మృతి

మాక్లూర్, వెలుగు: మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాపూర్‌‌‌‌లో బుధవారం రాత్రి పాము కాటుతో ప్రియతమ్ (55) అనే వ్యక్తి చనిపోయాడని ఎస్సై యాదగిరిగౌడ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ప్రియతమ్ 8 ఏళ్ల కింద ఉపాధి కోసం మాదాపూర్‌‌‌‌కు వచ్చి కంకర మిషన్‌‌లో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి కంకర మిషన్ పక్కనే గుడిసెలో తన కొడుకు, బావమరిది కలిసి నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే జిల్లా కేంద్ర హాస్పిటల్‌‌కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రియతమ్ మృతి చెందాడు. మృతుడి కొడుకు వి.జి చంద్​ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

................................................................................

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ  దహనం

బోధన్, వెలుగు: విద్యుత్ సవరణ బిల్లు 2022ను వ్యతిరేకిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు ఆర్.గౌతమ్‌‌కుమార్​ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ బిల్లుతో కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం తప్ప ప్రజలకు ఎలాంటి లాభం లేదని అన్నారు. వెంటనే కేంద్రం బిల్లును ఉపసంహరించుకోవాలని లేకుంటే అందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పిరోల్ల పోశెట్టి, పోశెట్టి, వెండి శంకర్, కార్తీక్, ఉదయ్, రాజు, ప్రసాద్, మారుతి, విఠల్ పాల్గొన్నారు.  

..........................................................................................................

యువతతోనే దేశాభివృద్ధి సాధ్యం

సిరికొండ, వెలుగు: యువతతోనే దేశ అభివృద్ధి సాధ్యమని సీపీఐ (ఎంఎల్‌‌) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాస్‌ అన్నారు. సిరికొండ మండలంలో ప్రగతి శీల యువజన సంఘం ఆధ్వర్యంలో  జరిగిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలింభిస్తున్న విధానాలు రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హమీ ఇచ్చిన కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఈ సందర్భంగా పీవైఎల్ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.కారల్ మార్క్స్‌‌, ఉపాధ్యక్షుడిగా సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా బాజన్నగారి సాయిలు, సహాయ కార్యదర్శిగా చందు గౌడ్, కోశాధికారిగా చిరంజీవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సబ్ డివిజన్ కమిటీ కార్యరద్శి వి.బాలయ్య, ఐఎఫ్‌‌టీయూ జిల్లా కార్యదర్శి పద్మ, నాయకులు రాము, నర్సాగౌడ్, హుస్సేన్, చిన్నారెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.

.............................................................................................

పే స్కేల్ అమలు చేయాలని వినతి

లింగంపేట, వెలుగు: వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ గురువారం లింగంపేటలో వీఆర్ఏల సంఘం, ఎల్లారెడ్డి డివిజన్ లీడర్లు ఎమ్మెల్యే జాజాల సురేందర్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. 2022 ఫిబ్రవరి 27న  రాష్ట్రంలోని వీఆర్ఏలకు పేస్కేల్  అమలు చేస్తామని సీఎం కేసీఆర్​అసెంబ్లీలో ప్రకటించారని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం ఎల్లారెడ్డి డివిజన్​అధ్యక్షుడు డి.కాశీరాం,  ఉపాధ్యక్షులు అశోక్, సురేశ్‌‌, రవికుమార్, ప్రధాన కార్యదర్శి బాబు, కోశాధికారి విఠల్ మల్లేశం, అంజయ్య, భూమయ్య దివిటి సురేందర్ పాల్గొన్నారు.

న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

భీంగల్, వెలుగు: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆరెంజ్ ట్రావెల్స్ చైర్మన్ ముత్యాల సునీల్‌‌రెడ్డి డిమాంద్‌‌ చేశారు. మండల కేంద్రంలో చేస్తున్న సమ్మెకు గురువారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పే స్కెల్ హామీని అమలు చేయాలని డిమాండ్‌‌ చేశారు.  

..............................................................................

ఉత్సాహంగా ఫ్రీడం రన్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లా వ్యాప్తంగా గురువారం ఫ్రీడం రన్‌‌ నిర్వహించారు. ఈ రన్‌‌లో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, స్టూడెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య గొప్పదనాన్ని, విశిష్టతను తెలియజేస్తూ ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకే  వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు. 
  - వెలుగు, నెట్‌‌వర్క్‌‌