![భగీర మూవీ టీజర్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2023/12/along-with-announcement-of-bhagira-movie-title-teaser-released_b89f0PapFx.jpg)
‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీళ్లు ఏ ప్రాజెక్టు చేసినా వాటిపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్ కథతో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఓ సినిమా రూపొందుతోంది. ‘భగీర’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఉగ్రమ్’ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నాడు. సూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆదివారం శ్రీమురళి బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు శ్రీమురళి. అందులో పోలీస్ గెటప్ ఒకటి. ప్రశాంత్ నీల్ స్టైల్‌లోనే యాక్షన్‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లోనే విజువల్స్ కనిపిస్తున్నాయి. రుక్మిణీ వసంత్, ప్రకాష్ రాజ్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.