వంగూర్లో జోరుగా నాటు సారా విక్రయాలు

వంగూర్లో జోరుగా నాటు సారా విక్రయాలు

వంగూర్, వెలుగు :  మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు బంద్ కావడంతో నాటు సారా వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా భావించిన  విక్రయదారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు   ప్రచారం జరగుతోంది.  చిన్నచిన్న కిరాణం షాపులలో  యథేచ్చగా నాటుసారా విక్రయిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో నాటు సారా విక్రయదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేయాల్సిన అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి నాటు సారా విక్రయాలు అరికట్టాలని పలువురు కోరుతున్నారు.