కరీంనగర్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మంత్రి పదవులు దక్కడంపై శుక్రవారం కరీంనగర్‌లో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. సిటీలోని ఇందిరా చౌక్, ఫతేపుర, పొన్నం ప్రభాకర్ నివాసం వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు.
వేర్వేరుగా జరిగిన సంబురాల్లో సిటీ కాంగ్రెస్అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, సిటీ బీసీ సెల్ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు. కాపువాడ కరీముల్లా షా దర్గాలో మైనారిటీ సెల్అధ్యక్షుడు ఎండీ తాజ్ఆధ్వర్యంలో పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో లీడర్లు సమద్ నవాబ్, పద్మాకర్ రెడ్డి, ముస్తాక్, పద్మ, కర్ర సత్య, ప్రసన్న రెడ్డి, అనిల్, అరుణ్, మోహన్, రాజేశం, బాబు తదితరులుపాల్గొన్నారు.
యైటింక్లయిన్ కాలని, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థులు జి.వివేక్‌వెంకటస్వామి(చెన్నూరు), మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్(రామగుండం), శ్రీధర్‌బాబు(మంథని) భారీ మెజార్టీతో గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ రామగిరి మండలం వెంకట్రావుపల్లిలో కాంగ్రెస్లీడర్లు సంబురాలు నిర్వహించారు. యైటింక్లయిన్ కాలనీ మజీద్ ఆవరణలోనూ ముస్లిం సోదరులకు స్వీట్లు పంపిణీ చేశారు. లీడర్లు బత్తిని శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి, వీరారెడ్డి, రాములు, రబ్బానీ పాల్గొన్నారు.
టీఎన్జీవోల సంబురాలు
కరీంనగర్ టౌన్, వెలుగు: కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ టీఎన్జీవోలు సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం కరీంనగర్కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషదాయకమన్నారు.
తెలంగాణ రెండో సీఎం గా రేవంత్ రెడ్డి, మంత్రులుగా పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం చేయడంపట్ల టీఎన్జీవోల తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌రావు, సభ్యులు కిరణ్ కుమార్, రాగి శ్రీనివాస్, శారద, సబిత, సునీత, సరిత, హర్మేందర్ సింగ్ పాల్గొన్నారు.