చదువుతోపాటు మానవతా విలువలు నేర్చుకోవాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

చదువుతోపాటు మానవతా విలువలు నేర్చుకోవాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు మానవతా విలువలు నేర్చుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నల్గొండలోని కనగల్ మహాత్మాజ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల గ్రౌండ్‎లో  ఆటలాడుతున్న విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులపై పశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను లేపి జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారని అడిగారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడి చదువుకోవాలని చెప్పారు. హాస్టల్ స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, బాత్రూంలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ భిక్షమయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.