అల్పేష్ ఠాకుర్.. ‘గుజరాత్ క్షత్రియ ఠాకుర్ సేన’ ఫౌండర్ . ఆ రాష్ట్ర ఓబీసీల్లో పేరున్న లీడర్ . ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయిన వ్యక్తి. లోక్ సభ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కి ఒక్క రోజు ముందు హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. ఆ పార్టీ ఇమేజ్ ని దెబ్బతీయటమే అతని టార్గెట్ గాకనిపిస్తోంది. సామాజిక ఉద్యమాలతో పేరు తెచ్చుకున్నఅల్పేష్ చివరికి రొటీన్ పొలిటీషియన్ లా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ చేశారు.
అల్పేష్ ఠాకుర్ గ్రాండ్ ఓల్డ్ పార్టీని వీడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన బీజేపీలోకి ఎంట్రీకోసం గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. అల్పేష్ డిమాండ్లకు కమలదళం ఓకే అనకపోవటంతో సైలెం ట్ అయ్యారనే ప్రచారం కొన్నాళ్లుగా జరిగినా, మొత్తానికి ఆయన తన వర్గ ఎమ్మెల్యే లు ధవళ్ సింహ్ ఠాకుర్, భరత్‌జీ ఠాకుర్‌తో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. అల్పేష్ దూరమవటం కాంగ్రెస్ కి ఎదురుదెబ్బే. ‘ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏక్తా మంచ్ ’ కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్న అల్పేష్ నార్త్ గుజరాత్ లోని 4 లోక్ సభ సెగ్మెం ట్లలో ఎన్నికలను ప్రభావితం చేయగలరు.ఆయన రాజీనామావల్ల ఆ స్థానాల్లో కాంగ్రెస్ భారీగా నష్టపోతుంది. రాష్ట్ర నేతలు మాత్రం అలా అనుకోవట్లేదు. అల్పేష్ వెళ్లిపోవటాన్ని రిలీఫ్ గా ఫీలవుతున్నారు.లోక్ సభ ఎలక్షన్స్ లో పటాన్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని అల్పేష్ అడిగితే పార్టీ ఒప్పుకోలేదు.తాను చెప్పి నవాళ్లకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినా హైకమాండ్ పట్టించుకోలేదు. ‘అల్పేష్ ఏడాదిన్నరకిందటే కాంగ్రెస్ లోకి వచ్చారు. దశాబ్దాలుగా పనిచేసే లీడర్లు సైతం ఇలా గొంతెమ్మ కోరికలు కోరరు.అలాంటిది ఆయన తన స్థాయికి మించి ప్రవర్తించారు’ అనే టాక్ కాంగ్రెస్ వర్గాల నుం చి వినిపిస్తోంది.గుజరాత్ లోని ఓబీసీ కమ్యూనిటీల్లో కాంగ్రెస్ కు ప్రజాదరణ ఉంది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఓబీసీలు సుమారు 21 శాతం వరకు ఉంటారు. వాళ్లల్లో 147కులాలు ఉన్నాయి. ఓబీసీల్లో ముఖ్య ఉప కులాలుకోలి, చౌదరి, ఠాకుర్ . ఈ మూడు సామాజిక వర్గాలజనాభా.. మొత్తం 26 లోక్ సభ సీట్లలోని దాదాపు14 చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.గుజరాత్ లో2017 అసెంబ్లీ ఎన్నికల్లో అల్పేష్ ఠాకుర్ డైనమిక్పెర్ఫార్మెన్స్ వల్లే హస్తం పార్టీ పుం జుకోగలిగింది.
2015లోనే హవా మొదలు..
గుజరాత్‌లో పీసీసీ ప్రెసిడెం ట్ అమిత్ చావ్డా , భరత్సింహ్ సోలంకీ వంటి సీనియర్ నేతల్లో ఏ ఒక్కరూఅల్పేష్ రేంజ్లో పవర్‌ఫుల్ లీడర్‌షిప్ అందిం చలేరనే వాదన ఉంది. అల్పేష్ హవా నిజానికి 2015లోనేమొదలైం ది. హార్దిక్ పటేల్ ప్రారంభిం చిన పాటిదార్ల రిజర్వేషన్ల ఉద్యమానికి కౌంటర్ గా అల్పేష్.. ‘ఠాకుర్సేన’ను ఏర్పా టు చేశారు.బీజేపీ సర్కారుకు పాటిదార్లను ప్రోత్సహిం చాలనేఉద్దేశం లేదని తెలిసి అల్పేష్ వెం టనే ట్రాక్ మార్చాడు.ఠాకుర్ కమ్యూ నిటీ తాగుడుకి బానిస కాకుం డాచైతన్యం తెచ్చారు. సర్కారు అమలుచేసే ప్రొహిబిషన్ పాలసీల్లోని లోపాలను తీవ్రంగా విమర్శిం చారు.లోటుపాట్లు లేని విధానాల అమలు కోసం పట్టుబట్టారు. తద్వారా హార్దిక్ పటేల్ , అల్పేష్ ఠాకుర్, జిగ్నే ష్మేవాని లు పవర్ ఫుల్ న్యూ జనరేషన్ లీడర్లుగా ఫేమ్‌లోకి వచ్చారు. ఈ ముగ్గురు నేతలు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించి గత అసెంబ్లీ ఎన్ని కల్లో అధికారబీజేపీకి చుక్కలు చూపిం చారు.
2017లో రాహుల్ సమక్షంలో చేరిక
గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్కి ముందు 2017 అక్టోబర్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాం ధీ సమక్షంలో అల్పేష్ పార్టీలో చేరారు. రాధన్ పూర్ అసెంబ్లీ సీటులో పోటీచేసి విజయం సాధించారు. అనుచరుల్లో అర డజనుమందికి టికెట్లు ఇప్పించి అందులో ఎక్కువ మందినిగెలిపించారు. అయితే, అల్పేష్ కాంగ్రెస్ లో చేరినఏడాదికి అంటే 2018 అక్టోబర్ నాటికి పరిస్థితి మారిపోయింది. వలస కూలీలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు ఆయనకు చెడ్డ పేరు తెచ్చాయి. బతుకు దెరువుకోసం రాష్ట్రానికి వచ్చిన లేబర్ లో ఒకడు స్థా నికంగా ఉండే ఓ ఏడేళ్ల ఠాకుర్ బాలికను రేప్ చేయటంతో వివాదం రాజుకుంది. హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన మైగ్రెంట్స్ పై దాడులు జరిగాయి. దీంతో గుజరాత్ లోవయొలెన్స్ కి భయపడి యూపీ, బీహార్ , మధ్యప్రదేశ్‌లకు చెందిన వేలాది కార్మికు లు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పట్టారు.ఈ గొడవలకు అల్పేషే బాధ్యు డన్నా రు. ఆయన తన ప్రసంగాలతో ఠాకుర్ సేనను రెచ్చగొట్టా రనే అపవాదుపడింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అల్పేష్ ని దూరం పెట్టింది. అప్పటికే పార్టీకి జరగరాని నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తాను హస్తం పార్టీకి గుడ్బై చెప్పి , బీజేపీలో చేరతానని అల్పేష్ చూచాయగా చెప్పా డు. దీంతో ఆయన క్యాబినెట్ బెర్త్ కోరుతున్నా డనే రూమర్లు వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా ఆయన విజయ్ రూపానీ కేబినెట్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.