కరీంనగర్ టౌన్, వెలుగు : అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గురువారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. వేడుకల్లో కరస్పాండెంట్ రవీందర్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
స్టూడెంట్ల డ్యాన్స్‌లు అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అక్షయ కాలేజీ ప్రిన్సిపాల్ శైలజ, వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
సెయింట్ జార్జ్‌లో..
కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం ముందస్తు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి, అకాడమిక్ సీఈవో ఉమాకాంత్, ప్రిన్సిపాల్స్ భార్గవ్, నిరంజన్.. టీచర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఆటపోటీల్లో టీచర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.