భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రెడ్డిగూడెం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అటవీ శాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు బండారుగుంపు సమీపంలో పోడు సాగు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఫారెస్ట్ అధికారులు మాట్లాడటానికి వచ్చి... తమపై దాడి చేశారంటున్నారు గిరిజనులు. అధికారుల దాడిలో మహిళకు గాయాలయ్యాయని తెలిపారు. పొలం దున్నే నాగళ్లను కూడా తీసుకెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గిరిజనులు. స్థానిక ఎస్సై ఉన్నా స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.