కారు లోయలో పడి ఆరుగురు దుర్మరణం

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఈ యాక్సిడెంట్ లో చినిపోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. చక్రతా ప్రాంతంలోని త్యూని అటల్ మోటర్‌ మార్గంలో ప్రయాణిస్తున్న అల్టో కారు అదుపు తప్పి లోయలో పడింది.  800 మీటర్ల లోతైన లోయలో పడి కారు తుక్కు తుక్కైంది.  అందులో ఉన్న ఆరుగురు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలైయాయి. అతన్ని చికిత్స కోసం డెహ్రాడూన్ హయ్యర్ సెంటర్ కు పంపించారు. 

విషయం  తెలుసుకున్న  త్యూని పోలీసులు  ఎన్డీఆర్ఫ్ బృందంతో కలిసి  అక్కడికి చేరుకున్నారు. గంటలపాటు శ్రమించి రెస్క్యూ  ఆపరేషన్ చేసి లోయలో పడ్డ కారు నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారందరూ ఒకటే కుటుంబానికి చెందిన వారు. మృతులు హిమచల్ ప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో ఆరుగురు చనిపోవడం చాలా బాధకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.