ఐఈఎస్ ఎగ్జామ్ లో టాపర్​గా నారాయణ పూర్వ విద్యార్థి

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్–2024​) ఎగ్జామ్ లో నారాయణ స్కూల్ పూర్వ విద్యార్థి రోహిత్ ధొండ్గే ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ సింధూర నారాయణ, శరణి నారాయణ చెప్పారు. అంకితభావం, నిరంతర సాధనతో ఈ రికార్డు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు.

నారాయణ స్కూల్​లో  బేసిక్ కాన్సెప్ట్స్ పై వేసిన స్ర్టాంగ్ ఫౌండేషన్, నారాయణ ప్రోగ్సామ్స్, టీచింగ్ రోహిత్ విజయానికి ఎంతగానో దోహదపడ్డాయని వివరించారు. రోహిత్ విజయం ఎందరో యువకుల్లో స్ఫూర్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోహిత్ ధొండ్గే తో పాటు అతని కుటుంబ సభ్యులకు వారు అభినందనలు తెలిపారు.