60 ఏళ్లకు కలిసిన్రు..

ఆసిఫాబాద్, వెలుగు :  జిల్లా కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1963, 19-71 సంవత్సరంలో  చదువుకున్న  పదో తరగతి  విద్యార్థుల  పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని వాసవి గార్డెన్ లో అంబరాన్ని అంటేలా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు  చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

పూర్వ విద్యార్థులు అశోక్, సాయిని మదూకర్, గుండా బాలేశ్, కాసం మదూకర్, తాటిపెల్లి రాజేశ్వర్, లక్ష్మినారాయణగౌడ్, అనంతలక్ష్మి, అన్నపూర్ణ, సరోజిని, వినాయకరావ్, జగన్నాథం పాల్గొన్నారు.