కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జడ్పీ హైస్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2004- టెన్త్బ్యాచ్స్టూడెంట్స్ ఒక చోట చేరి తమ పాత జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. తమకు చదువు చెప్పిన టీచర్లను సన్మానించారు.
నిజాంసాగర్,(ఎల్లారెడ్డి ) : నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గత నెలలో పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్ సత్యవతి, లెక్చరర్ గా విధులు నిర్వహించిన బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాలయంలో రూ.3 లక్షలతో పార్క్ ను ఏర్పాటు చేశారు.
32 బ్యాచ్‌ల నుంచి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎర్రోళ్ల వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి రేణుకా కుమారి, ఉపాధ్యక్షుడు బాశెట్టి, నాగేందర్, నిర్వాహకులు డాక్టర్ విజయరాజ్, నవీన్ కుమార్, రాజబాబు, విక్రమ్, నరహరి చంద్రకాంత్, ప్రవీణ్, నరేశ్ కుమార్, అమరేందర్ గంగమోహన్, శోభ, రేఖ, సరిత, అనిత పాల్గొన్నారు.