చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఆలూరు గ్రామస్తులు ధర్నా చేశారు. ఆలూరు గేట్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. రోడ్డును వెడల్పు చేయాలని వివిధ పార్టీల నాయకులు.. కార్యకర్తలు.. స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను వయా సిద్దలూరు మీదుగా మళ్లించారు.
Also Read : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల సమన్వయంతో ఫ్రీ కోచింగ్
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. గత కొంత కాలంగా రోడ్డును వెడల్పు చేయాలని ఆలూరు గ్రామస్తులు అధికారులను కోరుతున్నారని తెలుస్తోంది. గ్రామస్తుల విఙ్ఞప్తిపై అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు.