అల్వాల్ వెలుగు : డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన అశోక్ (25) మచ్చ బొల్లారం ధర్మారెడ్డి కాలనీలో ఉంటున్నాడు.
అతని వద్ద డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించగా, ఆదివారం వెళ్లి అతని ఇంట్లో తనిఖీలు చేయగా.. 2 కిలోల ఓపియం దొరికింది. అశోక్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు అల్వాల్ పోలీసులు తెలిపారు.