
ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్ బాష్ లీగ్ లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. పదేళ్ల పైగా బిగ్ బాష్ లీగ్ ప్రయాణం అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఐపీఎల్ కు ముందు క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ మెంట్ చేసి వెళ్తుంది. ప్రపంచ క్రికెటర్లందరూ ఐపీఎల్ ఆడినా.. బిగ్ బాష్ లీగ్ లో ఇండియన్ క్రికెటర్స్ ఆడడానికి వీలు లేదు. ప్రపంచ లీగ్ ల్లో ఆడేందుకు భారత క్రికెటర్లకు బీసీసీఐ పర్మిషన్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. భారత క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్ లో ఆడితే నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఖాయం.
మన క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్ లో ఆడితే చూడాలని ఆస్ట్రేలియా క్రికెట్, ఫ్యాన్స్ కోరుకుంటుంది. అయితే ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అలిస్సా హీలీ మాత్రం ఒక భారత క్రికెటర్ ను బిగ్ బాష్ లీగ్ లో ఆడితే చూడాలనే తన కోరికను వ్యక్తం చేసింది. అతనెవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ బిగ్ బాష్ లీగ్ లో ఆడితే ఈ లీగ్ ప్రొఫైల్‌ను పెంచడమే కాకుండా ఆస్ట్రేలియాలోని యువ క్రికెటర్లకు కూడా స్ఫూర్తినిస్తుందని అలిస్సా హీలీ అభిప్రాయపడ్డారు.
Also Read:-బాబోయ్.. మ్యాచ్కు ముందు ఎంత మాట అనేశాడు.. మరో వివాదంలో రోహిత్ శర్మ..!
"ఒకసారి రోహిత్ శర్మ బిగ్ బాష్ లీగ్ లో ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అతను టీ20 క్రికెట్ కు ముగించాడని తెలుసు. అయితే అతను కూడా ధోనీలాగ టీ20 లీగ్ లో కొనసాగుతాడని ఆశిస్తున్నా. అతను ఈ లీగ్ ఆడితే ఫుల్ సపోర్ట్ ఉండడమే కాదు. లీగ్ మరొక స్థాయికి వెళ్తుంది". అని అలిస్సా హీలీ ఒక పోడ్ కాస్ట్ లో తెలిపారు. మిచెల్ స్టార్క్ భార్య అలిస్సా హీలీ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్. వికెట్ కీపర్ గా ఆమె ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడుతుంది. ఇక రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ బిజీగా ఉన్నాడు.
Mitchell Starc wife Alyssa Healy: "Imagine having someone like Rohit Sharma in the BBL , it would do wonders for our competition." pic.twitter.com/4GNC9UVsTm
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) April 3, 2025