అభిమానాలు కొన్నిసార్లు సెక్యూరిటీ కళ్ళు కప్పి మైదానంలోకి రావడం అప్పుడప్పుడూ మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇన్నింగ్స్,యూపీ వారియర్స్ మధ్య నిన్న (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్ లో ఒక అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని స్టేడియంలోకి దూసుకురావడంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ఈ సమయంలోనే యూపీ కెప్టెన్ అలీసా హేలీ తన ధైర్యాన్ని ప్రదర్శించింది.
అతన్ని ఒంటరిగా అడ్డుకుంటూ వెనక్కి నెట్టింది. ఆమ్ నుంచి తప్పించుకోవడానికి అతడు ఎంతో ప్రయత్నించాడు. ఈ లోపు సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆ అభిమానిని తీసుకెళ్లారు. హేలీ అడ్డుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫొటోలు చూసినవాళ్లంతా హేలీ ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఆస్ట్రేలియా మెన్స్ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అయిన హేలీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపీ వారియర్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు కొట్టింది.హేలీ మాథ్యూస్(55), యస్తికా భాటియా(26) శుభారంభమిచ్చారు. అయితే.. యూపీ బౌలర్ల దెబ్బకు ఆ తర్వాత వచ్చినవాళ్లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. యూపీ జట్టు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ కిరణ్ నవ్‌గరే (57 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి డబ్ల్యూపీఎల్ లీగ్ చరిత్రలోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచింది. గ్రేస్ హ్యారిస్(38 నాటౌట్), దీప్తి శర్మ(27 నాటౌట్) రాణించారు.
Alyssa Healy tackling the pitch invader tonight at the Chinnaswamy Stadium. pic.twitter.com/h3T9PgVadV
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2024