AP News: అమరావతిపై  త్వరలో వైట్​ పేపర్​ రిలీజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

ప్రజారాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు  పర్యటించారు.  రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో  నేలపై మోకరిల్లి సీఎం చంద్రబాబు నమస్కరించారు.  అమరావతిపై  త్వరలో వైట్​ పేపర్​ రిలీజ్ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 5 కోట్ల ఆంధ్రులకు అమరావతి చిరునామా అన్నారు.  తెలుగుజాతి గర్వంగా చెప్పుకొనే రాజధానిగా నిర్మిస్తారు.  గత ప్రభుత్వం అమరావతి బ్రాండ్​ ను దెబ్బతీసిందన్నారు.  అమరావతి ఏ ఒక్కరికి చెందినది కాదన్నారు. ఏపీ అంటే అమరావతి.. పోలవరం అన్నారు.

అమరావతి ప్రాంతాన్ని చూస్తే చాలా బాధకలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.  గత ప్రభుత్వం ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేదన్నారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి.. నీళ్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేయడంతో పాలన ప్రారంభించిందన్నారు. 80 శాతం పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు కూడా పూర్తి చేయలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అంటే సంపద సృష్టించే కేంద్రమన్నారు.  విశాఖను ఆర్ధిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు.  అలాగే కర్నూలును  ఆధునిక సిటీగా మారుస్తామన్నారు. 

అమరావతి సెల్ఫ్​ పైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నారు. అమరావతిలో వచ్చే ఆదాయంతోనే రాజధాని నిర్మిస్తామన్నారు . గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడిందన్నారు.  ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుందో అర్దం చేసుకోవాలన్నారు.  ఎవరైనా పని చేస్తారు.. విధ్వంసం చేసే వారిని ఎక్కడ చూడలేదన్నారు.  ఓ వ్యక్తి మూర్ఖత్వం  పోలవరాని శాపంగా మారిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.  రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శమన్నారు.  రౌడీయిజం చేస్తే నిర్ముహమాటంగా అణచివేస్తామన్నారు. 

గత ప్రభుత్వం డబ్బుల్లేవంటూనే రుషికొండలో రూ. 500 కోట్లలో భవనాలు కట్టిందన్నారు. ఉన్మాది బారినుంచి రాష్ట్రాన్ని దేవుడే కాపాడాడు. పవిత్రమైన రుషికొండ ప్రాంతాన్ని తవ్వారు. గల్లాపెట్టెఖాళీ అయింది.. అప్పులు విపరీతంగా చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టులను తప్పుదోవ పట్టించారన్నారు. పోలవరం పూర్తి అయితే రాయలసీమ రతనాల సీమ అవుతుందన్నారు.