చిర స్థాయిగా నిలిచిపోయేలా హరిహర వీరమల్లు మూవీ : ఏఎం రత్నం

చిర స్థాయిగా నిలిచిపోయేలా హరిహర వీరమల్లు మూవీ :  ఏఎం రత్నం

పవన్ కళ్యాణ్  హీరోగా  తాను నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు నిర్మాత ఏఎం రత్నం.  అభిమానులతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయే చిత్రం ఇదని అన్నారు. మంగళవారం ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర విశేషాలు తెలియజేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. మా కాంబినేషన్‌‌లో గతంలో ఖుషి, బంగారం సినిమాలు వచ్చాయి. 

ముచ్చటగా మూడో సినిమాగా ‘హరిహర వీరమల్లు’ రూపొందుతోంది. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.  ఇందులో  పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపిస్తారు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలై  అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా నిలుస్తుంది” అని అన్నారు.  దర్శకుడు జ్యోతికృష్ణ రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్  మార్చి 28న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది.