ప్రముఖ నటి అమలా పాల్ (Amala Paul)తన లేటెస్ట్ బాయ్‌ఫ్రెండ్,టూరిజం,హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ జగత్ దేశాయ్ (Jagat Desai)ను 2023 నవంబర్ లో పెళ్లి చేసుకుంది.ఇక రెండు నెలల గ్యాప్ లోనే అమలా తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా విషయానికి వస్తే శుక్రవారం (ఏప్రిల్ 5న) అమలాపాల్ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలు అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ సూరత్ లోని తన నివాసంలో జరిగినట్టు తెలుస్తుంది. ఈ సీమంతం వేడుకలలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. తన సీమంతం వేడుకలను తాజాగా అమలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అమలా పాల్ విషయానికి వస్తే..మాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో వరుస అవకాశాలు అందుకొని మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇక 2014లో దర్శకుడు ఏఎల్ విజయ్‌ను పెళ్లి చేసుకొని..2017లో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంది. అలా దాదాపు ఆరేళ్ళు ఒంటరిగానే ఉన్న అమలా పాల్ తన లేటెస్ట్ బాయ్‌ఫ్రెండ్ జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకుంది.