
మొదట గ్లామరస్ హీరోయిన్‌గా కనిపించిన అమల… ఆ తర్వాత తీరు మార్చేసింది. కాస్త డిఫరెంట్ గా ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోవడం లేదు. అందులోనూ ఉమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్స్ట్ కే ఓకే చెబుతోంది. ప్రస్తుతం నటిస్తున్న అదో అంద పరవాయ్ పోలా, ఆడు జీవితం చిత్రాలు ఆ కోవకు చెందినవే. ఓ పక్క సినిమాలు చేస్తూ నే వెబ్ సిరీస్ వైపు కూడా అడుగేసింది అమల. ఆల్రెడీ ‘లస్ట్ స్టో రీస్’ రీమేక్ లో నటిస్తోంది. ఇప్పుడు అంతకుమించిన ప్రాజెక్ట్ ఒకటి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద అడుగుపెడుతున్నారు. రాజ్ దీప్ భరద్వాజ్ డైరెక్షన్‌లో ఆయన నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో ఫిమేల్ లీడ్ గా అమలను తీసుకున్నారు. డెబ్భైల కాలంలో సాగే కథ ఇది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తపిస్తున్న ఓ ఫిల్మ్ మేకర్ కి, ఒక టాప్ హీరోయిన్‌కి మధ్య నడిచే ప్రేమ కథ. ఇది మహేష్ జీవితమేనని, పర్వీన్ బాబీకి ఆయనకి మధ్య రిలేషన్‌షిప్ ఆధారంగా తీస్తున్నారని సమాచారం. అంటే పర్వీన్ పాత్రలో అమల నటిస్తున్నట్టు లెక్క. భట్ సాబ్ పాత్రలో తాహిర్ రాజ్ భాసిన్ నటిస్తు న్నాడు. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నందుకు అమల ఆనంద పడుతోంది. ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ త్వరలో మొదలు కానుంది, నెక్స్ట్ స్టాప్ బాలీవుడ్‌లో అంటూ ట్వీట్ కూడా చేసింది. మొత్తానికి అమల మోస్ట్ వాం టెడ్ అవుతున్నట్టే ఉంది.
మరిన్ని వార్తలకోసం క్లిక్ చేయండి
అయోధ్య: రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసిన మోడీగాంధీ హాస్పిటల్ లో కరోనా టెస్టులు
గాంధీ హాస్పిటల్ లో కరోనా టెస్టులు