మార్చి 10 అమలక ఏకాదశి: శ్రీహరిని పూజించిన శ్రీకృష్ణుడు.. ఏ వస్తవులు దానం చేశాడో తెలుసా..

మార్చి 10 అమలక ఏకాదశి:  శ్రీహరిని పూజించిన శ్రీకృష్ణుడు.. ఏ వస్తవులు దానం చేశాడో తెలుసా..

హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.  ఆరోజు విష్ణువును పూజించి... ఉపవాస దీక్ష చేస్తారు.  తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం .. ఈ నెలలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ( మార్చి 10)  అమలక ఏకాదశి అంటారని వేదాల ద్వారా తెలుస్తుంది.   ఈ రోజున లోక రక్షకుడైన శ్రీహరిని అంటే విష్ణుమూర్తిని పూజించి.. అమలక ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలని పండితులు చెబుతున్నారు.  

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ప్రజలను రక్షించే బాధ్యత తీసుకున్నాడు.  ఆ సమయంలో ఆయన అమలక ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ఉసిరి చెట్టుకు రక్ష కట్టి పూజించి.. బ్రాహ్మణులు కొన్ని వస్తువులు దానం చేశాడని  పండితులు చెబుతున్నారు.  అప్పటి నుంచి ఆయన రాజ్యంలో ప్రజలందరూ సిరి ... సంపదలతో ఉన్నారని వేదాలు చెబుతున్నాయి. 

ఉసిరిని దానం చేయండి: విష్ణువుకు ఉసిరి అంటే చాలా ఇష్టం అని పండితులు చెబుతున్నారు.  అమలక ఏకాదశి ( మార్చి 10) రోజున విష్ణువు..  ఉసిరి చెట్టులో నివాసం ఉంటాడని నమ్మకం. అందుకనే ఉసిరి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. అయితే ఆ రోజున ఉసిరిని దానం చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం కూడా లభిస్తుంది.

అన్నదానం:  అమలక ఏకాదశి రోజున పేదలకు, అవసరార్థులకు ఆహార వితరణ చేయాలి. ఈ రోజున అన్నదానం చేసేవారికి గోదానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి.

నల్ల నువ్వులు : అమలక ఎడదాశి రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఈ దానం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశి రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది.

డబ్బు, దుస్తులు : అమలక ఏకాదశి రోజున, పేదలకు డబ్బు, వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. దీనితో పాటు ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా తొలగి పోతుంది.

పసుపు రంగు వస్తువులు: అమలక ఏకాదశి రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. దీని వలన ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటాయి. అంతేకాకుండా జాతకంలో బృహస్పతి గ్రహం కూడా బలపడుతుంది. 

అమలక ఏకాదశి  రోజున ఉపవాసం ఉంది శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. అమలక ఏకాదశి రోజున ఉసిరిచెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారి ఇల్లు పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందనీ, భోగ భాగ్యాలతో తులతూగుతారని జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. ఈ రోజున పూజలు, ఉపవాసాలతో పాటు, దానాలు కూడా చేస్తారు.

ALSO READ | రంగులకు బదులు బూడిదతో హోలీ.. ఎక్కడ ఎందుకో తెలుసా.?

ఈ రోజు విష్ణువుని పూజించడంతో పాటు ఉసిరి చెట్టుని కూడా పూజిస్తారు. విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి. అతని జీవితం ఆనందంతో నిండి పోపుంది. ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదతో ధన ధాన్యాలతో నిండి ఉంటుంది. ఈ రోజున విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటంతో పాటు దానధర్మాలు కూడా చేయాలి. ఈ రోజున దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.