
అమన్ సెహ్రావత్ ఒలంపిక్స్ సాధించిన భారత క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా మరో రికార్డును బ్రేక్ చేశాడు. 2024 పారిస్ ఒలంపిక్స్ ఫ్రీస్టైల్ ఈవెంట్ 57 కేజీల విభాగంలో ఆగస్ట్ 8న అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమన్ సెహ్రావత్ కాంస్యం గెలిచి ఇప్పటి వరకు పివి సింధూపై ఉన్న రికార్డ్‌ను అమన్ బ్రేక్ చేశాడు.
ఒలంపిక్స్ విజేతగా నిలిచిన అతిచిన్న వయస్కుడైన వ్యక్తిగా అమన్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. 21 ఏళ్ల నెల 14 రోజుల వయసులో బ్యాడ్మింటన్ పివి సింధూ 2016 రియో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది.
ఇప్పటి వరకు పివి సింధూ అతి చిన్న వయసున్న ఇండియన్ ఒలంపిక్స్ మెడల్ విజేతగా ఉన్నారు. 21 సంవత్సరాల 24 రోజుల వయసున్న అమన్ సెహ్రావత్ పారిస్ ఒలంపిక్స్ లో ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో బ్రౌంజ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ఒలంపిక్స్ మెడల్ సాధించిన అతి చిన్న వయసు గల భారత క్రీడాకరుడిగా అమన్ నిలిచాడు. పివీ సింధూ కంటే ముందు సైనా నెహ్వాల్ పై (22 ఏళ్ల 4 నెలల 18 రోజుల) వయసుతో ఈ రికార్డ్ ఉండేది.