Paris Olympics 2024: ఒక్క రాత్రికే 4.6 కేజీలు తగ్గాడు.. మ్యాచ్‌కు ముందు అమన్‌ షెరావత్‌ పరిస్థితి ఏంటంటే..?

Paris Olympics 2024: ఒక్క రాత్రికే 4.6 కేజీలు తగ్గాడు.. మ్యాచ్‌కు ముందు అమన్‌ షెరావత్‌ పరిస్థితి ఏంటంటే..?

కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్ గేమ్స్‌‌ లో ఇండియా స్టార్ రెజ్లర్‌‌‌‌ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది. అయితే భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కు ఇలాంటి సీన్ మరొకటి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపించాయి. గురువారం (ఆగస్ట్ 8) సెమీఫైనల్ ఓటమి తర్వాత అమన్ సెహ్రావత్ 61.5 కిలోల బరువుతో ఉన్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పోటా చేయడానికంటే ఇది 4.5 కేజీలు ఎక్కువ. కానీ తర్వాత 10 గంటల్లో అతను తన భారత కోచ్‌లతో కలిసి 4.6 కిలోల బరువు తగ్గడానికి అవిశ్రాంతంగా పనిచేశాడట. 

'మిషన్' ఒకటిన్నర గంటల మ్యాట్ సెషన్‌తో ప్రారంభమైంది. ఒక గంట హాట్-బాత్ సెషన్ జరిగింది. రాత్రి 12:30కి అమన్ ట్రెడ్‌మిల్‌పై నాన్‌స్టాప్‌గా ఒక గంట పరుగు తీశాడు. తర్వాత అతనికి 30 నిమిషాల విరామం ఇవ్వబడింది. చివరి సెషన్ ముగిసే సమయానికి, అమన్ ఇంకా 900 గ్రాముల బరువుతో ఉన్నాడు. దీంతో అతనికి మసాజ్ చేయించారు. తర్వాత ఐదు, 15 నిమిషాల రన్నింగ్ సెషన్‌లు జరిగాయి. ఉదయం 4:30 గంటలకు అమన్ బరువు 56.9 కిలోలు ఉండడంతో కోచ్‌లు ఊపిరి పీల్చుకున్నారు.

అమన్‌ షెరావత్‌ పారిస్‌ గడ్డపై మెన్స్‌ 57 కేజీల్లో కాంస్యం నెగ్గి రెజ్లింగ్‌లో తొలి మెడల్‌ అందించాడు. అదే టైమ్‌లో ఇండియా పతకాల సంఖ్యను ఆరుకు పెంచాడు. ఓవరాల్‌గా రెజ్లింగ్‌లో ఇండియా మెరుపులు తగ్గలేదని మరోసారి నిరూపించాడు. శనివారం జరిగిన మెన్స్‌‌ 57 కేజీల ఫ్రీస్టయిల్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ ప్లే ఆఫ్‌‌లో అమన్‌‌ 13–5తో క్రుజ్‌‌ డారియన్‌‌ టోయ్‌‌ (పుర్టారికో)పై సంచలన విజయం సాధించాడు. బరిలోకి దిగిన తొలి గేమ్స్‌‌లో పతకంతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక 2008 బీజింగ్‌‌ ఒలింపిక్స్‌‌ నుంచి బరిలోకి దిగిన ప్రతి ఒలింపిక్స్‌‌లో ఇండియన్‌‌ రెజ్లర్లు పతకం సాధించడం విశేషం.