బాకు (అజర్‌బైజాన్): ఇండియా షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. మెన్స్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో అతను ఈ పతకం సాధించగా.. విమెన్స్ స్టాండర్డ్ పిస్టల్‌లో ఇండియ విమెన్స్ టీమ్ బ్రాంజ్ గెలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో అమన్ 577 షాట్లతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ నెగ్గాడు.
కొరియాకు చెందిన లీ గుయ్యేక్ (574) సిల్వర్, ఫ్రాన్స్ షూటర్ కెవిన్ చాపన్ బ్రాంజ్ నెగ్గారు. విమెన్స్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్‌లో తియాన, యషితా షోకీన్, క్రితికా శర్మతో కూడిన ఇండియా 1601 స్కోరుతో బ్రాంజ్ గెలిచింది.