స్టాండర్డ్ ​గ్లాస్​లో అమన్సా పెట్టుబడి రూ.40 కోట్లు

స్టాండర్డ్ ​గ్లాస్​లో అమన్సా పెట్టుబడి రూ.40 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:  ఫార్మా, కెమికల్​ పరిశ్రమల కోసం ఇంజనీరింగ్​పరికరాలు తయారు చేసే స్టాండర్డ్​ గ్లాస్​ లైనింగ్​ టెక్నాలజీలో అమన్సా ఇన్వెస్ట్​మెంట్​ రూ.40 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రీ–ఐపీఓ ఫండింగ్​ విధానంలో ప్రైవేట్​ప్లేస్​మెంట్​పద్ధతిలో నిధులను సమకూర్చింది. ఫలితంగా స్టాండర్డ్​ గ్లాస్​ అమన్సాకు ఒక్కో షేరుకు రూ.140 చొప్పున 28.57 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. 

ఇది కంపెనీ ప్రీ–ఆఫర్​ షేర్​ క్యాపిటల్​లో 1.55 శాతానికి సమానం. ఐపీఓకు రావడానికి సెబీ ఈ ఏడాది అక్టోబరులో స్టాండర్డ్​గ్లాస్​కు ఫైనల్​అబ్జర్వేషన్​ పంపింది. త్వరలోనే పబ్లిక్​ఇష్యూ ప్రారంభమవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. స్టాండర్డ్​గ్లాస్​ఎన్​కంపాస్​ డిజైనింగ్​, ఇంజనీరింగ్​, మానుఫ్యాక్చరింగ్​, అసెంబ్లీ, ఇన్​స్టలేషన్​, కమిషనింగ్​సొల్యూషన్లను అందిస్తుంది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ పోర్ట్​ఫోలియోలో 65కుపైగా ప్రొడక్టులు ఉన్నాయని స్టాండర్డ్​ గ్లాస్​ తెలిపింది.