ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో ఇండియన్ ఆర్మీ విలీనం చేసింది. సైనికులు ఆర్మీ బ్యాండ్ మధ్య అమర్ జవాన్ జ్యోతి వద్ద ఒక కాగడాను వెలిగించి.. నేషనల్ వార్ మెమోరియల్ కు తీసుకుని వచ్చారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న ఈ జ్యోతిని నేషనల్ వార్ మెమొరియల్ లో విలీనం చేశారు.
#WATCH | Delhi: Amar Jawan Jyoti flame at India Gate merged with the flame at the National War Memorial. pic.twitter.com/Nd1dnfvWYW
— ANI (@ANI) January 21, 2022
#WATCH | Delhi: Merging of Amar Jawan Jyoti flame at India Gate with the flame at the National War Memorial is underway. pic.twitter.com/j7wMxpNWJS
— ANI (@ANI) January 21, 2022
అయితే అమర్ జవాన్ జ్యోతి జ్వాల విలీనంపై రాజకీయ దుమారం రేగింది. అమరజవాన్ జ్యోతి ఆర్పేయడం సరికాదంటూ కాంగ్రెస్ మండిపడింది. ధీర సైనికుల గుర్తుగా కొన్ని ఏండ్లుగా వెలుగుతున్న జ్యోతిని నేడు ఆర్పేస్తుండటం తీవ్ర విచారం కలిగిస్తోంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొంత మందికి దేశభక్తి, త్యాగనిరతి ఎన్నటికీ అర్థం కావన్నారు రాహుల్ గాంధీ, సైనికుల కోసం అమరజవాన్ జ్యోతిని తాము మళ్లీ వెలిగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు.
#WATCH | This is a very good decision taken by the govt, shifting is not the question, the honour lies where the names of the soldiers are written. The National War Memorial is the only place the soldiers should be honoured: Lt. Gen (Retd) PJS Pannu pic.twitter.com/ZR2DPXzP05
— ANI (@ANI) January 21, 2022
‘అమర్ జవాన్ జ్యోతి జ్వాల ఆరిపోవడం లేదు. దాన్ని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో కలిపేస్తున్నారు. అమర్ జవాన్ జ్యోతిలోని జ్వాల 1971 నాటి అమరవీరులకు నివాళులర్పించడం కోసం ఏర్పాటు చేయబడింది. ఈ జ్యోతి దగ్గర యుద్ధాల పేర్లు కానీ, వాటి పేర్లు కానీ ముద్రించలేదు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంత మంది మాజీ సైనికాధికారులు సమర్థిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ పీజేఎస్ పన్ను అన్నారు. జ్యోతి జ్వాలను మార్చడంలో సమస్య ఏమీ లేదని, అమర జవాన్ల పేర్లు ఉన్న చోటనే వారికి సరైన గౌరవం అందుతున్నట్టుగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ వార్ మెమోరియల్ లో మాత్రమే సైనికులకు గౌరవం అందాలన్నారు.
1972 నుంచి...
1971 భారత్, పాక్ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు గుర్తుగా ఇండియా గేటు దగ్గర స్మారకంగా అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటుచేశారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ సైనికుల జ్ఞాపకార్థం బ్రిటిష్ వారు ఇండియా గేట్ నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం మరియు ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన వారి పేర్లు ఇండియా గేట్‌పై చెక్కబడి ఉన్నాయి.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రాజధానిలో 176 కోట్ల వ్యయంతో నేషనల్ వార్ మెమొరియల్ స్మారకాన్ని నిర్మించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్మారకాన్ని ఓపెన్ చేశారు. దీని తర్వాత ఇండియా గేటు దగ్గర జరిగే అన్ని సైనిక కార్యక్రమాలను నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరకు మార్చారు.
మరిన్ని వార్తల కోసం..
టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ కు కరోనా
యూపీ సీఎం అ