- ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు
- సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ఛైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు
తెలంగాణలో పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డితో అమర రాజా కంపెనీ ఎండీ, గల్లా జయదేవ్ సమావేశమయ్యారు. తెలంగాణలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి గిగా ప్రాజెక్టును అమర రాజా కంపెనీ నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం (జనవర్ 3) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి,ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో గల్ల జయదేశ్ చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి పథంలో అమర రాజా కీలక భాగస్వామి అని అన్నారు. తెలంగాణలో ఆ కంపెనీ తలపెట్టిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ , ఇ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్ ల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అమర రాజా కంపెనీ ప్రాజెక్టు వేగంగా జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు ఎండీ గల్లా జయదేవ్ సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో తమ ప్రాజెక్టును విస్తరించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. న్యూ ఎనర్టీ, లిథియం అయాన్ బ్యాటరీ , ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు వివిధ రంగాలలో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దతను వ్యక్త పరిచారు.