న్యూఢిల్లీ: అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీకి ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ.249.12 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చి రూ.198.31 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. రెవెన్యూ రూ.2,796.27 కోట్ల నుంచి రూ. 3,263.05 కోట్లకు చేరుకుంది. ఆటోమొటివ్ సెగ్మెంట్‌లో సేల్స్ పెరిగాయని, ఇంటర్నేషనల్ బిజినెస్ మంచి గ్రోత్ నమోదు చేసిందని, తమ ఏజీఎం బ్యాటరీలకు డిమాండ్ కనిపించిందని కంపెనీ తెలిపింది.