కార్గిల్ వార్ లో వీర మరణం పొందిన తమిళనాడు ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ జీవితం ఆధారంగా తమిళ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి అమరన్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్యాన్ ఇండియా భాషలలో అక్టోబర్ 31నరిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమాలో మేజర్ ముకుంద్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించగా, ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి నటించి మెప్పించింది. ఈ సినిమా ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే రిలీజ్ రోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 42 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. హీరో శివ కార్తికేయన్ కెరీర్ లోనే ఇవే బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు.
అయితే కోలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది. దీంతో అమరన్ రిలీజ్ అయిన రెండో రోజు తమిళనాడులో దాదాపుగా రూ.23 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇటీవలే తమిళ్ దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ (GOAT) రూ.22 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రికార్డుని శివ కార్తికేయన్ రెండురోజుల్లోనే బ్రేక్ చేశాడు. లాంగ్ వీకెండ్ ఉండడం, అన్నిచోట్ల సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.