నితిన్ బ్యానర్‌‌‌‌‎లో అమరన్

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అమరన్‌’. సాయిపల్లవి హీరోయిన్. సోనీ పిక్చర్స్‌‎తో కలిసి కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ పెరియసామి దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న సినిమా విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితారెడ్డి ఈ సినిమా ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

కమల్ హాసన్ నటించిన సెన్సేషనల్ హిట్ ‘విక్రమ్’ తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌస్‌‌‎తో శ్రేష్ట్ మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం. కాశ్మీర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో..  మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌‌‌‌‎లో, ఇంటెన్స్‌‌‌‌‌‌‌క్యారెక్టర్‌‎లో శివకార్తికేయన్ కనిపించబోతున్నాడు. ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌‌‌‌‌‌‌‌‌‌లెస్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.